22nd June, 2024

ఘనంగా అవంతి 57వ జన్మదిన వేడుకలు

భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ కార్యాలయం - 12-06-2024 - బుద వారం

భీమిలి వైసిపి పార్టీ కార్యాలయం లో నిరంతర ప్రజా సేవకుడైన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి 57వ జన్మదిన వేడుకలు వైసిపి పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వేడుకల్లో భాగంగా వైసిపి శ్రేణులు కేకు కటింగ్ చేసి తమ ప్రియతమ నేత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అవంతి జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా మైనారిటీ అద్యుక్షులు ముస్తఫా ఆర్థిక సౌజన్యం తో SFS అనాద బాలలకు నిత్య అవసర సరుకులు బహుమతులు నాయకులు చేతులు మీదుగా అందివ్వడం జరిగింది రాజకీయం లో నైనా - క్రీడల్లో అయినా - వ్యాపారంలో అయినా - ఏ రంగం లో అయినా గెలుపు ఓటములు సహజం ఓటమి రాబోయే గెలుపు కి నాంది పడిలేచిన కెరటం లాంటి అవంతి జీవితం గెలుపైనా ఓటమైనా నాయకులు కార్యకర్తలు మేమంతా అవంతి తోనే మా రాజకీయ పయనం ఆయనతోనే ఉంటాం అని ఆయనే మా నాయకుడు అని నాయకులు కార్యకర్తలు ముక్త కంఠంతో పలకడం చేసారు అనంతరం జై జగన్ జై అవంతి అంటూ నినాదాలతో హోరెత్తించారు