అంతర్జాతీయ నగరంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేందుకు అద్భుత అవకాశాలు ఉన్న నగరం విశాఖపట్నం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ ఒక రోజు వర్క్ షాప్ లో భాగంగా నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖకు జ్యూవెల్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరుందని విశ్వ నగరంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న నగరమని మంత్రి […]