Avanthi Srinivas

Avanthisrinivas

This is about biography of Avanthi Srinivas Rao of AP Tourirm, Culture, Youth advancement Minister of Government of Andhra Pradesh.

టూరిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

విశాఖలో కైలాసగిరి పక్కన సముద్రపు ఒడ్డున నిలచిపోయి ఉన్న బాంగ్లాదేశ్ కు చెందిన “ఎంవీ మా” నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ రూపంలో మార్చి మరో అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. గురువారం తెన్నేటి పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2020 అక్టోబర్ లో తుఫాను తాకిడికివిశాఖ తీరానికి వచ్చిన బాంగ్లాదేశ్ నౌకను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.

రు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని

ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వరుదు కల్యాణి గారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని.వారి కుటుంబసభ్యులతో ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రిగా.. విద్యావేత్తగా విభిన్న ప్రతిభావంతులకు తాను వీలైనంత సాయం చేస్తానని అన్నారు

సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి.. వారు అన్ని రంగాల్లో రాణించేలా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనా హాల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్లు ఇంటికే వెళ్లి అందిస్తున్నారని..విభిన్న ప్రతిభావంతులకు ఈ విధానం వల్ల ఇబ్బంది లేకుండా […]

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, మహేశ్వరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అతడు, ఆమె, ప్రియుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ తగరపువలసలోని అవంతి కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించారు.ఈసందర్బంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన యండమూరి ఈ సినిమాకు కథ అందించడం సినిమా విజయం సాధిస్తుందనడానికి శుభసూచకమని అన్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ మందా, తెలుగమ్మాయి మహేశ్వరికి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని.. ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు. […]

మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు.

మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మొదటి సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మండలంలోని 16 గ్రామాల్లోని సచివలయాలు, సిబ్బంది, వలంటీర్లతో ప్రతినెలా రివ్యూ మీటింగ్ నిర్వహించాలని అన్నారు. సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను ఎంపీపీ […]

అవంతి విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ముత్తంశెట్టి శివ నందీశ్.

వివిధ అధికారిక కార్యక్రమాల నిమిత్తం విశాఖపట్నంలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని గారిని ఓ ప్రైవేటు హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ,

రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు.

తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పధకంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. సీఎం జగన్ మరింత ముందుకెళ్లి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని […]

జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సమీక్ష నిర్వహించారు.

జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ లక్ష్మీశ, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. పారిశుధ్యం, రోడ్డు నిర్మాణ పనులు, టౌన్ ప్లానింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా.. జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 20వేల మందికి ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద ఇళ్లు రిజిస్టర్ చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు కట్టుకున్న వారికి సీఎం జగన్ మోహన్ […]

ఈకార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమం

పవిత్ర కార్తీకమాసం సందర్భంగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్) సంయుక్తంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.