రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె కె రాజు గారు ,జి.వి.ఎం.సి కమీషనర్ సృజన గారితో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ 35వ వార్డులో గల కస్తూరి నగర్ ఏరియాలో కొండ వాలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజి, మెట్లు మార్గం, మంచినీటి , సామాజిక భవనాలు సమస్యలు తెలుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె కె రాజు గారు ,జి.వి.ఎం.సి కమీషనర్ సృజన గారితో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ 35వ వార్డులో గల కస్తూరి నగర్ ఏరియాలో కొండ వాలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజి, మెట్లు మార్గం, మంచినీటి , సామాజిక భవనాలు సమస్యలు తెలుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించటం జరిగింది .అక్కడే ఉన్న అంగన్వాడీ స్కూల్ కి వెళ్లి విద్యార్థుల వివరాలు,వారికి ఇస్తున్న భోజనం అడిగి తెలుసుకుని సరిగా లేక పోవడంతో అధికారుతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని చెప్పాను. జాతీయ రహదారి వద్ద 34వ వార్డులో వాసుదేవనగర్ వద్ద ఉన్న కాలువ వర్షం వచ్చినప్పుడు పొంగి ఆ మార్గం పూర్తిగా నిండిపోతుందని స్థానికులు చెప్పారు దీనిపై అధికారులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇవ్వటం జరిగింది. అనంతరం షాదిఖాణా కల్యాణ మండపంలో నిర్వహిoచిన సమీక్షా సమావేశంలో పొల్గొని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కెకె రాజు చెప్పిన నియోజకవర్గ సమస్యలు పరిస్కారానికి కృషి చేస్తానని హామీని ఇచ్చాను.ఈ కార్యక్రమంలోనగర వైకాపా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ,నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, జి.వి.ఎం.సి.అధికారులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
1 comment
1 Comment
Tatababu kolli
June 28, 2019, 2:55 pmఈ విధంగా చేయడం చాలా బాగుంది సార్
REPLY