రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ను తొలిగిస్తూ మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం లో ఈరోజు అనగా తేది 26-08-2022 శుక్రవారం నాడు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరం నుండి భీమిలి బీచ్ వరుకూ 28 కి మీ 40 ప్రాంతాలలో స్వచ్చంధ గా పాల్గొని చేపట్టడం జరిగింది.

కార్యక్రమం లో బాగంగా అవంతి గారు బీచ్ లో ఉన్న వ్యర్థాలను తొలిగించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో పర్యావరణం ఒక భాగం అలాంటి మన చూట్టూ ఉన్న పర్యావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అలా చేసినప్పుడే ఆహ్లాదకరమైన జన జీవనం మన సొంతం అవుతుంది అని, ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు 28 కి మీ అందరూ కలిసి పరిశుభ్రంగా చేయడం చాలా సంతోషం గా ఉందని,ఈరోజు జరిగిన ఈ క్లీనింగ్ స్వచ్చంధ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని దీని వలన సముద్ర జలాలను శుభ్రం గా ఉంచడమే కాక జీవరాశులను కాపాడినట్లు అవుతుంది అని ఆయన పిలుపు మేరకు వచ్చి కార్యక్రమం లో పాల్గొని విజయ వంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అదికారులు – నేవీ ఉద్యోగులు – పలు స్వచ్ఛంద సంస్థలు – విద్యా సంస్థలు – నాయకులు – ప్రజలు – కార్యకర్తలు – యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.