విశాఖ సిటీ – వి.యమ్.ఆర్.డి.ఎ కార్యాలయం – 02-10-2023 – లక్ష్మి వారం

బి.ఆర్.టి.యస్ రోడ్డు నిర్మాణం విషయమై 60 శాతం పైబడి ఇళ్ళు అలాగే ఇంటి స్థలం కోల్పోయిన బాధితులతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు గారి తో పాటు వి.యమ్.ఆర్.డి.ఎ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

సమావేశం లో బాగంగా అవంతి గారు మాట్లాడుతూ బి.ఆర్.టి.యస్ రోడ్డు నిర్మాణం కై స్వచ్ఛందం గా తమ స్దలములు ఇచ్చిన వారిలో 60 శాతం పైబడి ఇళ్ళు అలాగే ఇంటి స్థలం కోల్పోయిన వారికి ప్రభుత్వం తరుపున ప్రత్యున్నమార్గం లో ఇళ్ళు నిర్మాణం చేపట్టి అందివ్వాలని,అలాగే గతంలో అడవివరం బి.టి‌ఆర్ రోడ్డు నిర్మాణం కై స్థలం ఇచ్చిన వారికి అందవలసిన టి.డి.ఆర్ పెండింగ్ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి అందించడం లో టెక్నికల్ సమస్య వలన అనుకున్న సమయానికి అందించడం జరగలేదు త్వరలో టి.డి.ఆర్ అందించడం జరుగుతుంది అని,1:4 టి.డి.ఆర్ గతంలో ఇళ్ళు స్థలం కోల్పోయిన వారికి దేవస్థానం భూ సమస్త ఉందని టి.డి.ఆర్ ఇవ్వలేదు ఈ విషయాన్ని స్థానిక యంయల్ఏ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం జరిగింది.దానికి ఆయన సుముఖత తెలపడం జరిగింది.ఈ టీ.డి.ఆర్ అందించి తరువాత బి.ఆర్.టి.యస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఈ విషయం లో కలెక్టర్ గారు ,జీవియంసి కమీషనర్ గారు అన్ని విధాలా సంపూర్ణ సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతుంది అని‌ మాట్లాడారు

ఇళ్ళు నిర్మాణం చేపట్టడం లో అలాగే టి.డి.ఆర్ అందివ్వడం లో సత్వర న్యాయం చేస్తామని కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు సంపూర్ణ హామీ ఇవ్వడం జరిగింది

ఇళ్ళు నిర్మాణం విషయంలో అలాగే టి.డి.ఆర్ సమస్య పరిష్కారం విషయంలో చొరవ చూపిన అవంతి శ్రీనివాసరావు గారి పట్ల ప్రజలు సంతోషం తో హర్షం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు – జీవియంసి కమీషనర్ శ్రీకాంత్ వర్మ – ఎర్రా వర్మ బాబు – కర్రి స్వామి – బి.ఆర్.టి.యస్ బాదితులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *