నర్సీపట్నం – మకవారపాలెం (తామరం) – 06-11-2024 – సోమవారం

నర్సీపట్నం – మకవారపాలెం (తామరం) – 06-11-2024 – సోమవారం

అవంతి కళాశాలల అదినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం లో గల తామరం (మాకవారి పాలెం) అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో 2023 లో మొదటి సం లో ప్రవేశం పొందిన విద్యార్థులు కు స్వాగతం పలుకుతూ ప్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం కి రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు – నర్సీపట్నం యంయల్ఏ ఉమా శంకర్ గణేష్ గారు – జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవి మురళీ కృష్ణ గారు ముఖ్య అతిథులు విచ్చేయడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది

అనంతరం ఇంటర్నేషనల్ హ్యూమన్ బీట్స్ బాక్స్ వాయిస్ మ్యూజిక్ ఆధ్వర్యంలో గాయకులు ప్రియ దర్శిని మరియు విఘ్నేష్ లు చేత సంగీత విభావరి ఆలపించడం తో పాటు జెమిని టీవి ఫేమ్ చిరంజీవి చే ద్వని అలంకరణ తో కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు ను ఉర్రూతలూగించడం చేసింది

అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక సాంప్రదాయ భరతనాట్య నృత్యాలు ప్రదర్శన పలువురు ని ఆకట్టుకున్నాయి

కార్యక్రమం ను ఉద్దేశించి రాష్ట పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ 20 సం క్రితం ఇదే నర్సీపట్నం అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో చదువుకొన్న నేను ఈరోజు అదే కళాశాల లో జరిగే ప్రెషర్స్ డే కార్యక్రమం కి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని,తెలుగు వారికి మంచి మేధాశక్తి ఉందని విదేశాల్లో పని చేసే ప్రతీ నలుగురు ఉద్యోగులు లో తెలుగు వారే ఉన్నారని, విద్యార్థులు ను మంచి మార్గం లో క్రమశిక్షణ లో పెట్టడానికి మంచి సలహాలు ఇస్తుంటారు వాటిని పెడచెవిన పెట్టకుండా తూచ తప్పకుండా పాటించడం వలన మంచి ఫలితాలు విజయాలు పొందవచ్చునని మాట్లాడారు

అనంతరం అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నుకునే రంగం ఏదైనా కానీ కృషి పట్టుదలతో చదవడం ద్వారా అత్యున్నత స్థానాన్ని అందిపుచ్చు కోగలమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు కు ఉన్నతమైన విద్యను అందించి వారిని అత్యున్నతమైన స్థాయి లో ఉంచాలన్నది అవంతి కళాశాల లక్ష్యం అని, కమ్యూనికెషన్ స్కిల్స్ సాంకేతిక నైపుణ్యం ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ను సాధించవచ్చు అని మాట్లాడారు

అనంతరం యంయల్ఏ శంకర్ గణేష్ గారు మాట్లాడుతూ నర్సీపట్నం లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కళాశాల స్థాపించి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు కు విద్యను బోధించి ఉన్నత స్థానాల్లో ఉంచిన అవంతి శ్రీనివాసరావు గారి కి కృతజ్ఞతలు తెలిపారు

సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ మన జీవితంలో కాలం చాలా విలువైనది అని కాలాన్ని మనం గౌరవించాలని కాలాన్ని వృదా చేయకుండా నిరంతరం విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు

అనంతరం ముఖ్య అతిథులు చేతులు మీదుగా వివిద రకాలైన క్రీడల్లో విజేతలు గా నిలిచిన వారికి బహుమతులు సర్టిఫికెట్ లను అందివ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు – యంయల్ఏ ఉమా శంకర్ గారు – జిల్లా యస్సి మురళీకృష్ణ గారు – NSTL అసోసియేషన్ డైరెక్టర్ గణేష్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *