ఈరోజు అనగా తేది 02-09-2022 శుక్రవారం నాడు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం లో పలు చోట్ల స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

కార్యక్రమం లో బాగంగా మొదటిగా ఆయన జీవియంసి పియంపాలేం 6వ వార్డు లో గల వైయస్సార్ విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించి నివాళులు అర్పించగా రాజన్నను స్మరించుకుంటూ వైయస్సార్ అమర్ రహే జొహార్ వైయస్సార్ అని వైసిపి పార్టీ శ్రేణులు నినాదాలతో హారెత్తించారు.

అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా 6 వ వార్డు లో వృద్దులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది – అనంతరం రాజన్న వర్థంతి సందర్భంగా భీమిలి జోన్ మూడవ వార్డు వైసిపి నాయకులు 2000 మందికి ఏర్పాటు చేసిన భారీ అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

కార్యక్రమంని ఉద్దేశించి అవంతి గారు మాట్లాడుతూ రాజకీయ క్షేత్రం లో కొంత మంది నాయకులు కేవలం నాయకులు గానే మిగిలిపోతారని ప్రజల గుండె చప్పుడు నుండి వచ్చిన రాజన్న లాంటి నాయకులు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన ఆశయాలకు తగిన విధంగా చూపిన బాటలో ఆయన కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాసంక్షేమ పాలన అందించి ఆయన వారసుడు గా నిలిచారని ఆయన 12 వ వర్థంతి సందర్భంగా నా పిలుపు మేరకు వైసిపి శ్రేణులు చేసిన ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎనలేనివని ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.