మహిళల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు పద్మనాభం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నవరాత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కంటే ఇప్పటి ప్రభుత్వం మహిళల సాధికారిక ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని ఆయన పాలనలో మహిళలకు సముచిత స్థానం కల్పనతో పాటు ప్రతీ మహిళా స్వతంత్ర యజమానిగా ఎదగాలనే ఆలోచనతో జగనన్న చేయూత తో పాటు మరికొన్ని పథకాలు పెట్టి మహిళా సాధికారికతకు రూపకల్పన చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే దక్కింది అని మహిళలు అంతా ఆయన వెంటే ఉన్నారని మాట్లాడారు అనంతరం మహిళలు అంతా కలిసి జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారుఅనంతరం అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా 3,899 మంది లబ్దిదారులకు 7 కోట్ల 30 లక్షల రూ చెక్కును అందివ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ గారు,యంపిపి మద్ది రాంబాబు గారు, జెడ్పిటిసి సుంకరి గిరి గారు,పార్టీ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణ రావు గారు,వైస్ యంపిపి ఈర్ల రాజేశ్వరి గారు ,యంపిడివో ,ఎంఆర్వో,సంబంధిత అధికారులు,సర్పంచ్ లు యంపిటిసి లు,ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు