సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి.. వారు అన్ని రంగాల్లో రాణించేలా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనా హాల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్లు ఇంటికే వెళ్లి అందిస్తున్నారని..విభిన్న ప్రతిభావంతులకు ఈ విధానం వల్ల ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు. మంత్రిగా.. విద్యావేత్తగా విభిన్న ప్రతిభావంతులకు తాను వీలైనంత సాయం చేస్తానని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు యూ అన్ని రంగాల్లో రాణించాలని.. లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించాలని మంత్రి గారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.