ఈరోజు భీమిలి నియోజకవర్గం జీవియంసి 79 వ వార్డు యల్లపువాని పాలెం హైస్కూల్ లో 1 కోటి 80 లక్షలు రూ నిధులతో నాడు – నేడు పనులకు – 1కోటి 65 లక్షలు రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు భూమి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది.
అనంతరం ఆయన చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు – నేడు లో భాగంగా విద్యారంగంలో పాఠశాలలు సుందరీకరణ , అదనపు తరగతి గదులు, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి , మథ్యాహ్నం భోజనం పథకం ఇలా పలు సంస్కరణలు చేసి ప్రభుత్వ స్కూల్లు కూడా కార్పోరేట్ స్కూల్ కి దీటుగా చేసారని దీని వలన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సంఖ్య కూడా పెరుగుతోంది అని, ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది అని ప్రతీ ఒక్కరు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లల తలదండ్రులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.