ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించారు.ఈసందర్బంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన యండమూరి ఈ సినిమాకు కథ అందించడం సినిమా విజయం సాధిస్తుందనడానికి శుభసూచకమని అన్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ మందా, తెలుగమ్మాయి మహేశ్వరికి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని.. ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు. ఈసందర్భంగా సినిమా విజయం సాధించాలని మంత్రి అన్నారు.కౌశల్ మందా మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ పై తనకు నమ్మకం ఉందని అన్నారు. విశాఖలో సినిమా ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రేమ, సస్పెన్స్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. సునీల్, బెనర్జీ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారని అన్నారు. ఈసినిమా ఫంక్షన్ కు విద్యార్థులు, అభిమానులు ఎక్కువగా హాజరయ్యారు. కౌశల్ మందాకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. విద్యార్థులకు అభివాదం చేసి కౌశల్ వారిని ఉత్సాహ పరిచారు. ఈకార్యక్రమంలో చిత్ర నిర్మాతలు రామ్ తుమ్మలపల్లి, అవంతి విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ముత్తంశెట్టి శివ నందీశ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.