మొదటిగా ఆయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ నిదులు రూ 13 లక్షలు తో బాందేవపురం యస్సి కోలనీ లో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసారు. పద్మనాభం మండలం బాందేవపురం రెల్లి కోలనీ – యస్సి కోలనీ జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోని 226 ఇళ్ళు గడప గడపకు తిరిగి జగనన్న ఏళ్ల పరిపాలనా కాలంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పద్మనాభం మండలం బాందేవపురం లో అవంతి గారి దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు:

1) బాందేవపురం అంబేద్కర్ కోలనీ లో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని

2)బాందేవపురం రెల్లి వీదిలో జలమడుగు రాముడు ఇంటి నుంచి బంగారి సన్యాసమ్మ ఇంటి వరుకూ రోడ్డు కు ఇరువైపులా సిసి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని

3) బాందేవపురం లో త్రాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని,

4) బాందేవపురం లో విద్యుత్ స్తంభాలు తోపాటు లైట్లు వేయాలని

సమస్యలు విని పరిష్కారం అయ్యేలా చేస్తానని సంపూర్ణ హామీ ఇచ్చిన అవంతి గారికి ప్రజలు ఆనందంతో దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల యంపిపి లు వైస్ యంపిపి లు జెడ్పిటీసి లు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.