భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (గండి గుండం పంచాయతీ) – సచివాలయం కోడ్ 10390276 – 15-10-2023 – బుద వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనందపురం మండలం గండి గుండం పంచాయతీ లో మొదటిరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి గారు పర్యటించడం జరిగింది

గండి గుండం పంచాయతీ లో పర్యటన కు విచ్చేసిన అవంతి గారికి అశేష ప్రజానీకం – బాణా సంచా వెలుగులు తో – తీన్ మార్ మోతలతో గండి గుండం సర్పంచ్ గండ్రేడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడుగడుగునా సాదర స్వాగతం పలకడం జరిగింది

పర్యటన లో బాగంగా అవంతి శ్రీనివాసరావు గారు (9 క్లస్టర్ ) లలో 371 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ఈ నాలుగున్నర ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలకు వివరించడం జరిగింది

వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలను మీ అభిప్రాయం తెలుపమని అవంతి గారు అడగగా

వైసిపి ప్రభుత్వం పాలనలో మేమంతా సంతోషం గా ఉన్నామని ప్రజలు సంతోషం తో హర్షం వ్యక్తం చేయడం జరిగింది

సర్పంచ్ గండ్రేడి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్ళలో నియోజకవర్గం శాశనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చొరవతో చేసిన అభివృద్ధి ని అందించిన సంక్షేమ పథకాలు అమలు ను ప్రజలకు వివరించడం జరిగింది

గండి గుండం పంచాయతీ లో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అవంతి గారు అడగగా ఆయన దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు

1) గండి గుండం పంచాయతీ మొత్తం సిసి రోడ్డు – డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని

2) సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని

3) జీడి పిక్కల ఫ్యాక్టరీ లైన్ లో సిసి రోడ్డు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని

4) యస్సి కోలనీ లో సిసి రోడ్డు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని

పలు కారణాలు చేత సంక్షేమ పథకాలు అమలు కాలేదు వాటిని మరల పునర్వపరిశీలన చేసి అందేలా చేయాలని

సమస్యలు విన్న అవంతి గారు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది

సమస్యలు పరిష్కారం కై శ్రీకారం చుట్టిన అవంతి గారికి స్థానికులు సంతోషం తో దన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు – ఆనందపురం మండలం వైసిపి శ్రేణులు – సచివాలయం సిబ్బంది వాలంటీర్లు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *