భీమిలి నియోజకవర్గం – 5వ వార్డు (మారికవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) – 31-10 -2023 – మంగళ వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 5వ వార్డు లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది

కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్య వంతమైన సమాజమే లక్ష్యంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే వినూత్న కార్యక్రమం కి శ్రీకారం చుట్టిందని,ఇందులో భాగంగా వైద్యులు స్వయంగా ప్రజలు చెంతకు వెళ్ళి ,వారికి వివిధ రకాల వైద్య పరిక్షలు చేసి ఉచిత మందులు అందజేస్తున్నారు అని,దివంగత ముఖ్యమంత్రి రాజన్న ఆరోగ్య శ్రీ సృష్టి కర్త అయితే ఆయన కుమారుడైన జగనన్న ఆరోగ్య ప్రదాత అని,ఆయన మస్తిష్కం లో పుట్టిన ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వాడ వాడలా ప్రతీ వీదికి ప్రతీ గడప కు ప్రతీ కుటుంబం కి చేరువై ఈ ఆరోగ్య సురక్ష శిబిరాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అంతేకాక గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది అని,జగనన్న ప్రవేశపెట్టి ఆరోగ్య సురక్ష పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించడం తో పాటు విద్య శిబిరాలు నిర్వాహణ తో పాటు శిబిరాలకు ప్రజలను తరలించడం లో సంపూర్ణ బాధ్యత ప్రతీ ఒక్కరు తీసుకోవాలని జగనన్న పాలన ఆలోచనా విధానం కి విధేయులుగా నడవడమే మన అందరి ప్రామాణికం అని, మదురవాడ జోన్ లో అధిక సంఖ్యలో రోజు వారి కూలి చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారని నేను యంయల్ఏ గా ఇక్కడే 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముఖ్యమంత్రి గారి ఏమి చొరవతో నిర్మాణం చేపట్టి మెరుగైన వైద్యం అందించడం జరిగింది భీమిలి ప్రజలు దీవెనలతో మళ్ళీ గెలిచి మరిన్ని మంచి సేవలు అందిస్తానని మాట్లాడారు

అనంతరం వైద్య శిబిరం లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను అవంతి చేతులు మీదుగా సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమంలో 5వ వార్డు నాయకులు – సచివాలయం కన్వినర్ లు – గృహ సారథులు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *