జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ లక్ష్మీశ, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. పారిశుధ్యం, రోడ్డు నిర్మాణ పనులు, టౌన్ ప్లానింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా.. జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 20వేల మందికి ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద ఇళ్లు రిజిస్టర్ చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు కట్టుకున్న వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పాట్ రిజిష్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించి వారికి శాశ్వత భూహక్కు కల్పిస్తున్నారని.. గతంలో ఏ సీఎం ఇలా చేయలేదని అన్నారు. దీని ద్వారా ఆ ఇళ్లపై వారు లోన్లు తీసుకునే అవకాశం, ఇంటిపై ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.చంద్రబాబు తీరుపై మంత్రి గారు స్పందిస్తూ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తాను అధికారంలో ఉండగా చేయలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తుంటే ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని మంత్రి మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం జరగదని మంత్రి అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మొద్దని.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈసమీక్షలో మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్లు జియ్యని శ్రీధర్, సతీష్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *