జీవియంసి 8వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజలు సాదర స్వాగతం పలికారుఆనంతరం ఆయన రెండవ రోజు వివేకానంద నగర్ 1 – దుర్గా నగర్ – యస్సి బిసి కోలనీ లో 550 ఇళ్ళు ఉండగా ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగిందిఅనంతరం ఆయన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడగగా1) యస్సి కోలనీ 5 వ లైన్లో మెట్లు కి సిసి రోడ్లు వేయాలని2) త్రాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ నిర్మించాలని3)అవంతి శ్రీనివాసరావు సామాజిక భవనము – బిసి సామాజిక భవనము మరమ్మతులు చేయించాలని 4)వీధి విద్యుత్ దీపాలు (లైట్లు) వేయాలని కోరగాసమస్యలు విన్న అవంతి శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ లు – వార్డు ఇంచార్జ్ లు – వార్డు ప్రెసిడెంట్ లు – ప్రభుత్వ అధికారులు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు