మొదటిగా అవంతి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనేది ఏ ఉద్దేశంతో చేపడుతుందో ప్రజలు వద్దకు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులమైన మిమ్ములను ఎందుకు పంపుతున్నారో అన్న విషయాలను ప్రతీ ఒక్కరికీ వివరించడం చేసారుఅనంతరం 4వ వార్డు కాపులుప్పాడలో 300 ఇళ్ళు ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగగా జగన్ మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగిందిఅనంతరం ఆయన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడగగా
1) పరదేశి పాలెం (కాపులుప్పాడ పంచాయతీ ) లో డ్రెయినేజీ వ్యవస్థ (బ్రిడ్జి) నిర్మించాలని
2) గృహములు ఇప్పించాలని
3) కొండపేట లో త్రాగునీరు 50 ఇళ్ళు కు ఇంటింటి కొళాయిలు వేయాలని
4) కాపులుప్పాడలో శ్మశాన వాకిట ఏర్పాటు చేయాలని
5)కళ్యాణ మండపం నిర్మించాలని
సమస్యలు విన్న అవంతి శ్రీనివాసరావు గారు సంబంధిత అధికారులు కు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారుఅవంతి శ్రీనివాసరావు గారి చొరవతో నేటికి తీరబోతున్న సమస్యలకు ప్రజలు సంతోషంతో అవంతి గారికి ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ లు – ఇంచార్జ్ లు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.