జాతీయ రహదారిపై నిర్మించిన కాలువ లోతట్టులో నిర్మించడం వలన వర్షం వచ్చినప్పుడల్లా డ్రైనేజీ మురికి నీరు బయటికి పొంగి పొర్లి పారడమే కాక రాకపోకలకు వాహన దారులకు చుట్టుపక్కల నివశించే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ సమస్యను పరిష్కరించమని గతంలో అవంతి శ్రీనివాసరావు గారు సంబంధిత జాతీయ రహదారి అధికారులకు స్థానిక జీవియంసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారు చేసిన సరైన పరిష్కారం జరగక అదే సమస్య పరిష్కారం కాకపోవడంతో

ఈరోజు అనగా తేది 11-09-2022 ఆదివారం నాడు భీమిలి శాసనసభ్యులు గౌ. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు స్వయంగా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి శ్రీకారం చుట్టి మొదటిగా 1వ వార్డు, 2 వ వార్డు కి సంబందించిన సబ్బివాని కల్లాలు రామన్న పేట లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యను పర్యవేక్షించి సంబంధిత అధికారులు కు శాశ్వత పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయడమే కాక ఏవిదంగా చేయాలని వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

అనంతరం ఆయన కురిసిన భారీ వర్షాలకు జీవియంసి 2వ వార్డు సత్యనారాయణ స్వామి కొండ ప్రాంతం లో కూలిపోయిన రక్షణ గోడను సందర్శించి పరిస్థితి ని సమీక్షించి స్థానికులతో మాట్లాడారు అనంతరం వెంటనే స్పందించి సంబందిత అధికారులు కు సంపూర్ణ రక్షణ గోడ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం అవంతి గారు ఎంతో కాలంగా చిల్లపేట పరిసర ప్రాంతాల్లో నివశిస్తున్న వారికి చిల్లపేట చెరువు వలన కలిగే థుర్ఘంద వాసన ( చెడు వాసన) వలన కలిగే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడానికి చిల్లపేట చెరువును సందర్శించి స్థానికులతో నాయకులతో మాట్లాడి సమస్యను తెలుసుకుని సంబంధిత అధికారులు అయిన జీవియంసి అధికారులతో ప్రజలు వాసన భరించలేక పోతున్నారు కీటకాలు వలన ఆనారోగ్యాలు పాలవుతున్నారు కనుక చేరువులో ఉన్న నీరును అవుట్ లెట్ ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని అలాగే చెరువు లోనికి మురికి నీరు వెళ్ళకుండా డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించాలని సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు .

iఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు – ఇంచార్జ్ మహేష్ గారు – జెడ్పిటీసి గాడు వెంకటప్పుడు గారు- 1వవార్డు, 2వ వార్డు కార్పోరేటర్ – ఇంచార్జ్ – వార్డు ప్రెసిడెంట్ లు – ఆయా పదవుల్లో ఉన్న వారు – నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.