భీమిలి నియోజకవర్గం – 6వ వార్డు (RH కోలనీ) – 03-11-2023 – శుక్ర వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో 6వ వార్డు RH కోలనీ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు – భీమిలి నియోజకవర్గం నాయకులు శ్రావణ్ కుమార్ గారు

కార్యక్రమం లో బాగంగా అంగన్వాడీ కేంద్రం వారు ఏర్పాటు చేసిన వివిద రకాలైన స్టాల్స్ లను అవంతి గారు పర్యవేక్షించడం జరిగింది

అనంతరం ప్రజలతో అవంతి గారు మాట్లాడుతూ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా సంక్షేమం పథకాలు అమలు చెస్తూ అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేస్తూ విద్య వైద్యం లో వినూత్న రీతిలో పలు నూతన సంస్కరణలు తీసుకువచ్చి పేద మధ్య తరగతి బుడుగు బలహీనుల వర్గాల వారి కి మంచి పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే అని,ఆయన పాలన ను పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అనుసరించేలా చేసిన ఆయన పాలనను అందరికి తెలిసేలా మహిళల అక్కా చెల్లెళ్ళు అయిన మీరే ప్రచారం చేసి మరల ఆయనను ముఖ్యమంత్రి గా చేసే పాత్ర మీరు పోషించాలని ఎలక్షన్ లో మీరు ప్యాన్ గుర్తు ను మరిచిపోకుండా వేసి నన్ను గెలిపించి మరింత సేవలు అందించేందుకు మీవంతు తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిస్తూ మాట్లాడారు

అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచిత మందులు కిట్టులను అవంతి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది

విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను అవంతి ఘనంగా సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం నాయకులు శ్రావణ్ కుమార్ గారు – ప్రభుత్వ వైద్యులు – వైద్య సిబ్బంది – వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు ఆయా పదవుల్లో ఉన్న వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రభత్వ అదికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ఆర్పీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *