ఈరోజు అనగా తేది 11-08-2022 లక్ష్మివారం నాడు భీమిలి SVLNS ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన గౌ. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోవడం జరిగింది.

అనంతరం అవంతి గారి చేతులు మీదుగా నియోజకవర్గంలో 9 వేల మంది విద్యార్థులుకు 5 కోట్ల 48 లక్షలు రూ జగనన్న విద్యా దీవెన చెక్కును ఇవ్వడం జరిగింది.

కార్యక్రమం ను ఉద్దేశించి శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యా విధానంలో నూతన విధానాలతో పాటు పలు పథకాలతో సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ సంస్థలకు దీటుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే అని నాడు నేడు వలన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరిక అధికంగా ఉందని విద్యార్థులు చదువు తో పాటు మంచి క్రమశిక్షణ అలవరుచుకోవాలని మాట్లాడారు.

కళాశాల ప్రిన్సిపాల్ గారి అభ్యర్థన మేరకు కళాశాల లో విద్యార్థులు కు త్రాగునీటి సౌకర్యార్థం ఆర్వో వాటర్ ప్లాంట్ మరియు క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని, ఏప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపడతామని, నూతన గదులకు (APROTECH) నూతన వసతులు ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ మంజుల గారు – మండల యంఆర్వో గారు – సాంఘీక సంక్షేమ అధికారులు – కార్పోరేటర్ లు – వార్డు ఇంచార్జ్ లు – ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *