భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (బోని పంచాయతీ) – 07-11-2023 – మంగళ వారం.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న 5వ సం లో 2వ విడత జిల్లా స్థాయి రైతు భరోసా పంపిణీ కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి పిలుపు తో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోని అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

సాంప్రదాయ కోలాటం ఆటలతో పాటలతో అవంతి శ్రీనివాసరావు గారి కి బోని అప్పలనాయుడు గారు ఘనమైన సాదర స్వాగతం పలకగా విద్యార్థినులు జాతీయ గీతం ఆలపించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి శ్రీనివాసరావు గారు జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారు ఆర్డీవో భాస్కర్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది

కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక బ్యాంక్ రుణాలు కట్టలేక అప్పులు బాదలతో రైతన్నలు హత్మహత్య లు చేసుకొనే పరిస్థితి చూసాం.వ్యవసాయ సాగు లో పంట పండించే విషయంలో వారు పడే కష్టాలు నష్టాలు నేరుగా తెలుసుకొని రైతే దేశానికి వెన్నెముక రైతే అనే మంచి ఆలోచన తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తే ఆయన కుమారుడైన జగనన్న ఈరోజుల్లో వ్యవసాయం దండుగ అనే దానిని వ్వవసాయం పండుగ లా చేసుకునేలా ప్రతీ రైతన్న జీవితంలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి కల్తీ లేని విత్తనాలు ఎరువులు అందించడం తో పాటు ఏదైనా అకాల వర్షాలు వలన రైతన్న పంట నష్టపోతే నష్టపరిహారం అందివ్వడం తో పాటు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా రైతన్న లు పండించిన పంటను కొనుగోలు చేయడం.గతంలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలో ఎక్కడా చూడని విధంగా రైతన్న విత్తనం విత్తి పంట అమ్మేవరుకూ రైతన్నలకు తోడుగా ఉండాలన్నదే జగనన్న పాలన లక్ష్యం అని, పగటి పూట రైతన్న లకు ఉచిత విద్యుత్ ఇస్తుంది వైసిపి ప్రభుత్వం అని,నేటి వైసిపి ప్రభుత్వ జగనన్న పాలనలో రైతే రాజు అన్నట్లు సాగుతుంది అని,మాటలతో కోటలు కట్టడం జగనన్న రాదు చేతలతో చేసి చూపించడమే ఆయనకు తెలిసిన పాలన అని,ఇలాంటి పాలన కావాలంటే మళ్ళీ జగనన్నే రావాలి ఆయన రావాలి అంటే భీమిలి లో అవంతి గెలవాలి రాబోయే ఎన్నికల్లో ప్యాన్ గుర్తు పై ఓటేసి నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు

అనంతరం అంచనా విలువ రూ 17.50 లక్షలు MGNRGS నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని – అంచనా విలువ రూ 21.85 లక్షలు నిధులతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ని అవంతి గారి జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది

అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి ముఖ్య అతిథులు చేతులు మీదుగా రైతులకు 11కోట్ల 82 లక్షలు రూ చెక్కు ను అందించి నియోజకవర్గం లో ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది

అనంతరం అవంతి గారు ముఖ్య అతిథులు చేతులు మీదుగా మొక్కలు నాటడం జరిగింది

ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అదికారులు – విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారు – విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు కోలా గురువులు గారు – విశాఖ అగ్రి ఎడ్వైజరీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెదబాబు గారు – మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోని అప్పలనాయుడు గారు – బోని పంచాయతీ సర్పంచ్ బోని అప్పల కొండ – యంపిటిసి బోని పార్వతి – మూడు మండలాల యంపిపి లు – జెడ్పిటిసి లు – వైస్ యంపిపి లు – సర్పంచ్ లు – యంపిటిసి లు – ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – నాయకులు కార్యకర్తలు – రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *