భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం – 04-11-2023 – శని వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న వైయస్సార్ చేయూత మహిళా మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం కి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు – జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు ముఖ్య అతిథులు గా పాల్గోవడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా యంయల్ఏ అవంతి గారు – కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు – జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు వైయస్సార్ చేయూత మహిళా మార్ట్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది

అనంతరం అవంతి గారు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి మార్ట్ ను సందర్శించి మార్ట్ లో ఉత్పత్తులు కోసం అడిగి తెలుసుకోవడం జరిగింది

అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత లో బాగంగా వైయస్సార్ చేయూత మహిళా మార్ట్ ఉపాధి ఒకటని, ఈ మహిళా మార్ట్ ద్వారా మండలం లో ఉన్న ప్రజలు అందరికి నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని,నాణ్యమైన సరుకులు అందించడం వలన ప్రజలకు నాసిరకం సరుకులు,కల్తీ సరుకులు నుంచి విముక్తి కలుగుతుంది అని దీని వలన ఆరోగ్యంగా జీవిస్తారు కనుక ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అనంతరం అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలే మహరాణులు అని,మహాళా సమైఖ్యల ద్వారా జీవనోపాథులు ఏర్పాటు చేసి వివిధ ఆదాయ అభివృద్ధి కలాపాలు చేపట్టి ప్రతీ ఒక్క సభ్యురాలిని మహిళా పారిశ్రామిక వేత్తలు గా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతీ వేదికలో చెప్పిన రీతికి అనుగుణంగా మహిళలకు వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా,సున్నా వడ్డీ ఇలా పలు పథకాలు ఇవ్వడం తో పాటు దానికి బ్యాంక్ లను అనుసందానం చేస్తూ స్ర్తీనిది,ఉన్నతి మరియు జగనన్న తోడు రుణాలు ద్వారా ఆర్థికత చేకుర్పు చేస్తూ,మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకునే విదంగా ప్రభుత్వం వివిద సంస్థలు ద్వారా ప్రోత్సాహం అందిస్తుంది అని, విశాఖ జిల్లా లోనే మొట్ట మొదటి మహిళా మార్ట్ ను ఆనందపురం లో ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందని,ఆనందపురం మండలం లో ఉన్న 1522 సంఘాల్లో ఈన్నటువంటి 15659 మంది మహిళలు అందరి ఇది ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మహిళలను ఆర్థికంగా కాకుండా రాజకీయాలు లో కూడా పదవులు అదరోహించేలా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన మహిళా రిజర్వేషన్ లను ఆంద్ర ప్రదేశ్ లోనే దేశంలో అధిక శాతంలో ప్రవేశ పెట్టి పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు జగనన్న అని,మహిళలు మీరంతా బాగుండాలంటే మళ్ళీ జగనన్న నే ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని పిలుపునిస్తూ మాట్లాడారు

జిల్లా పరిషత్ చైర్మన్ శుభద్ర గారు మాట్లాడుతూ దేశంలో మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగనన్నే అని,నాటి నుండి నేటి వరకు సమాజంలో మహిళలను వంటింటికి మాత్రమే పరిమితం చేస్తే జగనన్న మాత్రం మహిళలే ప్రగతికి పునాదులు అంటూ అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి ఎదగేలా చేసారని ఈరోజు మాకంటూ ప్రత్యేక గుర్తింపు గౌరవం లభిస్తుంది అంటే అది వైసిపి ప్రభుత్వం లో జగనన్న పాలనలోనే అని మాట్లాడారు

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మల్లిఖార్జున రావు గారు – విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ శుభద్ర గారు – జిల్లా అధికారులు – ప్రాజెక్ట అధికారి – సెర్ప్ అదికారులు – మండలం వైసిపి పార్టీ శ్రేణులు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *