రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు లో బాగంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత కార్యక్రమం ని ఈరోజు అనగా తేది 24-09-2022 శనివారం నాడు ఆనందపురం మండలం పాలవలస చేపట్టడం జరిగింది కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళలకు చేసింది ఏమీ లేదని జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి అని వీరికి చట్టసభల్లో అయితేనేమి స్థానికత లో 60 శాతం రిజర్వేషన్లు కల్పించి పదవుల్లో కూర్చోబెట్టి వారికి పెద్దపీట వేసిన ఘనత ఆయనదే అని అంతేకాక పాదయాత్ర లో ఏవైతే మాటిచ్చారో ఇచ్చిన రీతిగా డ్వాక్రా సున్నా వడ్డీతో రుణాలను మాఫీ చేయడం ప్రతీ అక్క చెల్లి స్వాతంత్ర్యంగా ఎదగాలని జగనన్న చేయూత జగనన్న కోలనీలు ఇలా పలు పథకాలు మహిళలకే కల్పించారని, పాలనలో తండ్రి రెండు అడుగులు వేస్తే జగనన్న పది అడుగులు వేసి అవినీతి లేని సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నారని ప్రతీ అక్క చెల్లి ఆయన మీపట్ల చేస్తున్నదానికి మీరు కృతజ్ఞత కలిగి జీవించాలని మరింత సేవలు అందించేందుకు ఆయన్ను గెలిపించాలని మాట్లాడారు అనంతరం మహిళలు అంతా కలిసి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారుఅనంతరం అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా స్త్రీ నిధి ద్వారా 8 మంది అక్కాచెల్లెళ్ళు కు 4లక్షల రూ అలాగే జగనన్నచేయూత లబ్దిదారులకు చెక్కును అందజేయడం జరిగింది అనంతరం రూ 75 లక్షలు రూ అంచనా విలువతో ఎన్, హెచ్,ఎన్, గ్రూపు నిధులతో నెషనల్ హైవే 16 నుండి నాగ హనుమాన్ ఫిష్ పెకర్స్ కంపెనీ వరుకూ రోడ్డు విస్తరణ కు శంకుస్థాపన , జలజీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించిన త్రాగునీటి ట్యాంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో యంపిపి,జెడ్పిటిసి,వైస్ యంపిపి లు,మండల యంపిడివో, యంఆర్వో, సర్పంచ్ లు, యంపిటిసి లు,వైస్ సర్పంచ్ లు,ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.