రెండవ రోజు (23-09-2022 – శుక్రవారం) 605 జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో శాసనసభ్యులు గౌ.ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గోని ఇళ్ళు తిరిగి జగనన్న 3 ఏళ్ల పరిపాలనా కాలంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అడిగి తెలుసుకోవడం జరిగిందిభీమన్న దొర పాలెం లో అవంతి గారి దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు:

1) ఎర్రవానిపాలెం నుండి భీమన్న దొర పాలెం BT రోడ్డు నందు వరదల సమయంలో ముంపు అవుతుంది సమస్య పరిష్కారం చేయాలని

2) భీమన్న దొర పంచాయతీ మొత్తం డ్రైనేజీ సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని

3)బంటుమొకర గ్రామం లో సిసి రోడ్డు వేయాలని

4) తుమ్మనివానిపాలెం (ST కోలనీ)గ్రామం మొత్తం వరద ముంపుకి గురి అవుతుంది డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలనికోలవానిపాలెం దీర్ఘకాలిక సమస్యలు

1) కోలవానిపాలెం గ్రామం నందు ఒక్కటే నీళ్ళు ట్యాంక్ ఉండటం వలన కొలాయి నందు నీరు రాకపోవడం జరుగుతుంది నూతన ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని

2) రామాలయం నుండి కోమటి చెరువు వరుకూ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలనిసమస్యలు విన్న అవంతి గారు సంబంధిత అధికారులు కు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సమస్యలు విని పరిష్కారం అయ్యేలా చేస్తానని సంపూర్ణ హామీ ఇచ్చిన అవంతి గారికి ప్రజలు ఆనందంతో దన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో మూడు మండలాల యంపిపి లు జెడ్పిటీసి లు వైస్ యంపిపి లు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.