పవిత్ర కార్తీకమాసం సందర్భంగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్) సంయుక్తంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.