ఈరోజు అనగా తేది 12-09-2022 సోమవారం నాడు భీమిలి నియోజకవర్గం జీవియంసి పరిదిలో మధురవాడ 5,6,7, వార్డు లలో గౌ.అవంతి శ్రీనివాసరావు గారు మరియు వార్డు కార్పోరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక గారి ఆధ్వర్యంలో 4కోట్లు రూ నిధులతో వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు – ఆయుస్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి ) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌ.విడదల రజని గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది కార్యక్రమం ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నే మొట్టమొదటి గా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టు వదలని విక్రమార్కుడు లా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తెచ్చేలా చేసిన అవంతి శ్రీనివాసరావు గారి కి ధన్యవాదాలు తెలిపారుఅనంతరం అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రదానం గా మధురవాడ లో గల స్లమ్ ఉండే పేద ప్రజలకు అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో పెట్టడం జరిగిందని అంతేకాక ఆధునిక వసతులతో వీటిని సుందరీకరణ చేసి మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏదైతే ఉందో ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యం అది భీమిలి నియోజకవర్గం లో అందరికి అందేలా సియం గారి సహకారంతో అందేలా మరింత కృషి చేస్తానని మాట్లాడారు అనంతరం రేవల్లపాలెం రోడ్డు సమస్య ను , స్థానిక సమస్యలను విశాఖ జిల్లా కలెక్టర్ గారి కి అవంతి శ్రీనివాసరావు గారు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గారు – శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు -నగర మేయర్ గొలగాని హరి కుమారి గారు – 6వ వార్డు కార్పోరేటర్ జీవియంసి చీప్ విప్ ముత్తంశెట్టి ప్రియాంక గారు – విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున రావు గారు – జీవియంసి కమిషనర్ లక్ష్మి షా గారు – ఆరోగ్య కేంద్రం సిబ్బంది – వార్డు కార్పోరేటర్ లు వార్డు ఇంచార్జ్ లు వార్డు ప్రెసిడెంట్ లు ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *